సంయుక్త సర్వేకు సహకరించాలి

– పోలవరం అథారిటీకి లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పోలంవరం ప్రాజెక్టు, దాని నిర్మాణానికి సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) జనవరి 26న న్యూఢిల్లీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సంయుక్త సర్వేకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ మేరకు రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ అటు ఏపీ సర్కారుకు, ఇటు పొలవరం అథారిటీ చైర్మెన్‌కు ఉత్తరం పంపారు. పోలవరం మూలంగా తెలంగాణపై పడుతున్న ప్రభావాన్ని, నష్టాలను ఈ సందర్భంగా లేఖలో వివరించారు. ఈమేరకు సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సుంకేశుల ఆనకట్ట ద్వారా తుంగభద్ర జలాలను మాత్రమే తరలించి వినియోగించాలనీ, శ్రీశైలం ద్వారా కృష్ణాజలాలను తరలించరాదంటూ సాగునీటి శాఖ ఇంజినీర్‌ చీఫ్‌ సి. మురళీధర్‌ తుంగభద్రా బోర్డుకు లేఖ పంపారు. కృష్ణా ట్రిబ్యునల్‌కు విరు ద్ధంగా వ్యవహరించరాదంటూ లేఖ ద్వారా స్పష్టం చేశారు. అలాగే అక్రమం గా కృష్ణా జలాలు తరలించడం తెలంగాణకు ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు.

Spread the love