– ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాఠశాలలకు ప్రహారీ గోడలు, విద్యార్థులకు యూనిఫాం ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ.. సీఎం, ఎమ్మెల్యేలు ఉండటానికి రూ.12 వందల కోట్లు సెక్రటేరియట్ నిర్మాణానికి ఎక్కడి నుంచి వచ్చాయని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. విలాసవంతమైన డైనింగ్ హాల్‌కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం నుంచి కొందరు బీఎస్‌పీలో చేరారు. బహుజన రాజ్య స్థాపనకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.