ఎయిర్‌పోర్టులో 1.761 కిలోల బంగారం పట్టివేత

నవతెలంగాణ-శంషాబాద్‌
విదేశాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు వచ్చిన కేరళకు చెందిన ఒక ప్రయాణికుని వద్ద నుంచి కస్టమ్స్‌ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్‌ ఆర్‌జిఐ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం జరిగింది . కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన ఒక ప్రయాణికుడు ఇకె-526 విమానం లో దుబారు మీదుగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అనుమానంతో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేసి అతని వద్ద 1.761 కిలో గ్రాముల బంగారం గుర్తించారు. వెంటనే బంగారా న్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంగారం విలువ రూ.1,10,06250 ఉంటుందని అంచనా వేశారు.

Spread the love