మౌలిక వసతుల ఏర్పాటు అభినందనీయం

– నోముల సర్పంచ్‌ పల్లాటి బాల్‌రాజ్‌
నవతెలంగాణ-మంచాల
నోముల ప్రభుత్వ పాఠశాలలో చింతక్రింది చక్రపాణి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్‌ పల్లాటి బాల్‌ రాజ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నోముల ప్రభుత్వ పాఠశాలలో చింతక్రింది చక్రపాణి స్వర్గీయ శ్రీ నల్లనాగుల బాల్‌రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులు కూర్చోవడానికి కార్పేట్స్‌ (చెత్రంజిలు) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతక్రింది చక్రపాణి చిన్ననాటి నుంచి సేవా దృకథం గ్రామంలో అనేక సేవా కార్య క్రమాలు చేపడు తున్నట్టు తెలిపారు. గతంలో పాఠశాలకు వంట పాత్రలు అందించినట్టు గుర్తు చేశారు. ఈ సేవా కార్య క్రమంలో భాగంగా పాఠశాలల్లో గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలు, సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించేటప్పుడు విద్యా ర్థులు కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి కార్పేట్స్‌(చెత్రంజీలు) అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మెన్‌ పల్లాటి జగన్‌, ఎచ్‌ఎం. సత్తారి రాజీ రెడ్డి, దాత చింతక్రింది చక్రపాణి, వార్డు సభ్యులు దూసరి లావణ్య, సిద్ధన్నాగారి వెంకట్‌ రెడ్డి, చింత క్రింది వీరేష్‌, ఎస్‌ఎంసీ సభ్యులు పల్లాటి శ్రీనివాస్‌, ఉపాధ్యా యులు బాలు నాయక్‌, నవనీత, విజరు, బాల్‌రాజ్‌, ఐలయ్య, అంగన్‌వాడీ టీచర్‌ లక్ష్మి, ఆరోగ్య కార్యకర్త నవనీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love