100సంవత్సరాలు, 100 మంది బలగం, నేలకొరిగిన శాతాధిక మహావృక్షం

నవతెలంగాణ – సుల్తానాబాద్ రూరల్
జీవితమంతా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, ఆ నాటి జ్ఞాపకాలను ఈ తరం చిన్నారులకు వివరిస్తూ తన అనుభావాలతో మూడు తరాలుగా కుటుంబ బాధ్యలను సమర్థవంతంగా నిర్వర్థించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆ తల్లి 100సంవత్సరాల పోరాటం నుంచి శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన కాంపెల్లి హనుమవ్వ(100) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 26ఏండ్ల కిందట భర్త కాంపెల్లి భానయ్య మృతి చెందారు. వీరికి తొమ్మిది మంది కూతుర్లు, ముగ్గురు కొడుకులు కాగా మనుమలు, మనుమరాళ్లు కలిపి మొత్తం 100 మందికి పైగా బలగం ఉంది. వీరిలో ఎంతో మంది టీచర్లు, ఇంజినీర్ల ప్రయోజకులుగా ఉన్నారు. శనివారం సాయంత్రం ఆశ్రునయాల మధ్య హనుమవ్వ అంత్యక్రియలు ముగిశాయి. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

Spread the love