విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల సం చాలకుల కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ క్యాంపస్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు వాటిని విడుదల చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్.ఇ.నవీన్ నికోలస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్‌లలో చూడొచ్చు..https://results.bsetelangana.org, ttps://results.bse.telangana.gov.in, https://bse.telangana.gov.in, https://schooledu.telangana.gov.in. మార్చి 14న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఈ నెల 13న పూర్తయిన సంగతి తెలిసిందే. దాదాపు 5.15 లక్షల రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఈ ఏడాది త్వరగా ఫలితాలు విడుదల చేయాలని భావించిన అధికారులు ముందుగానే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో ఈ ఏడాది పరీక్షలు ముగిసిన 15 రోజుల్లోపే ఫలితాలను విడుదల కానున్నాయి.
మీ సేవా వాట్సప్ ద్వారా ఎస్‌ఎస్‌సీ ఫలితాలు
బుధవారం విడుదలయ్యే ఎస్సెస్సీ ఫలితాలను ఇంటి దగ్గర నుంచే క్షణాల్లో పొందవచ్చని సంచాలకుల కార్యాలయం తెలిపింది. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సెల్‌ఫోన్‌లోనే ఫలితాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) విభాగం, ఎస్‌ఎస్‌సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఫలితాలు-2026ను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌లో అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను ఏప్రిల్ 29న మధ్యాహ్నం 2:30 గంటల నుంచి వాట్సాప్ ద్వారా వెంటనే పొందవచ్చు. విద్యార్థులు అధికారిక మీ సేవ వాట్సాప్ నంబర్ 80969 58096 ద్వారా సులభంగా తమ ఫలితాలను పొందే వీలు కల్పించింది. దీంతో వెబ్‌సైట్లలో అంతరాయ సమస్యలు లేకుండా, వేగంగా, అత్యంత సులభంగా ఫలితాలను పొందవచ్చు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో సమన్వయంతో మీ సేవ ఈ ఫలితాలను అందిస్తోంది.
వాట్సప్ ద్వారా ఎస్‌ఎస్‌సీ ఫలితాలు పొందే విధానం:
1.మీ మొబైల్‌లో 80969 58096 నెంబర్ ను
”మీసేవా తెలంగాణ”గా సేవ్ చేసుకోండి.
2.వాట్సప్ ఓపెన్ చేసి ”నఱ” అని మెసేజ్ పంపండి.
3.”ఎస్‌ఎస్‌సీ ” అని టైప్ చేయండి.
4.మెనులో Open Service ఎంపికపై క్లిక్ చేయండి.
5.మీ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయండి.
6.వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో వాట్సప్‌లో అందుతుంది.
నేడు పదో తరగతి ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



