138వ మే డే ను వాడవాడలా ఘనంగా నిర్వహించాలి

– ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి-నూనె వెంకటేశ్వర్లు  

నవతెలంగాణ – డిండి
మే డే ఉత్సవాలను వాడవాడనా ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం డిండి  మండలంలో సీపీఐ ప్రజా భవన్ లో మే డే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న, 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని, 4 లేబర్ కొడ్ లను వెంటనే రద్దు చేయాలని, దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించటం కోసం  ఐక్య పోరాటాలు నిర్వహించాలని కోరారు. అమెరికా  నగరంలో  హే మార్కెట్లో 1886 మే 1 న సమ్మె చేయాలని నిర్వహించి, ప్రపంచ కార్మికుల సమైక్య సోషలిస్ట్ మరియు కార్మిక సంఘాల సమ్మె  హే మార్కెట్లో భారీ నిరసన ప్రదర్శన చేసి, ఎనిమిది గంటల పని దినంకై కదం తొక్కిన కార్మికులను పెట్టుబడిదారులు వారి గుండాలు, పోలీసుల తుపాకుల  కాల్పుల్లో చనిపోయిన వారి రక్తంతో తడిసి ఎగిసిన ఎర్రజెండే మేడే  అన్నారు. దశాబ్దాలుగా సాధించుకున్న కార్మిక 44 చట్టాలను 29 చట్టాలను సమూలంగా రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోడ్ ల ను తెచ్చిందన్నారు. గ్రామపంచాయతీ కార్మికులను, మధ్యాహ్న భోజన కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనo  అందించాలన్నారు. ఆటో కార్మికులకు, హమాలి కార్మికులకు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బుశిపాక లింగమయ్య, ,గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు  రామావత్ జోహార్ లాల్, బాలరాజ్, జహంగీర్, గెలమ్మ, బాలమ్మ, లక్ష్మమ్మ, సాలమ్మ, లక్ష్మమ్మ, మహేష్ బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love