నవతెలంగాణ – అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది. 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది.