రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా యువజనుల శాఖా, కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, కామారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద గల స్వామి వివేకానంద 162వ జన్మదినాన్ని, జాతీయ యువజనుల దినోత్సవం ను పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి
పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో రాష్త్ర స్థాయి యువజనదినోత్సవాలో పాల్గొన్న యువతి యువకులకు సర్టిఫికేట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు (100) మంది యువతి యువకులు, విద్యార్ధిని విద్యార్థులు, జిల్లా యువజన క్రీడల అధికారి, కే.యస్ జగన్నాథన్, సిబ్బంది ఆర్కె కళాశాల కరస్పాండెంట్, జైపాల్ రెడ్డి , అథ్లెటిక్స్ కియోన్ సభ్యలు, తదితరులు పాల్గొన్నారు.