టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు..19 మంది అరెస్టు

TSPSC-paper-leakage-caseనవతెలంగాణ – హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో రెండు రోజుల్లోనే 19 మంది నిందితులను సిట్‌ అధికారులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. సోమవారం ఎనిమిది మందిని నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట సిట్‌ అధికారులు హాజరుపరిచారు. నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలిస్తూ మెజిస్ట్రేట్‌ జీ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. నిందితులందరూ పూల రమేశ్‌ (ఏఈ), అతడి సోదరుడు పూల రవికిశోర్‌ ద్వారా గ్రూప్‌లుగా ఏర్పడి ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. జన్నయిల అశోక్‌, ధరావత్‌ కల్యాణ్‌ లొంగిపోయారు. పూల రమేశ్‌ నుంచి మర్క రాముడు ఏఈ పేపర్‌ను పొందాడు. నిందితులు శివకుమార్‌, సురేందర్‌, హరికృష్ణ, ధనావత్‌ రాజేశ్‌, నరేందర్‌, నాగరాజు, అశోక్‌, కల్యాణ్‌, నాగరాజ్‌, విజయ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌, సునీల్‌, సంతోష్‌, రాముడుతోపాటు మరో ఐదుగురిని మెజిస్ట్రేట్‌ ఇంటి దగ్గర రిమాండ్‌ చేయగా, 29 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

Spread the love