పార్లమెంట్‌పై దాడికి 22 ఏండ్ల..

నవతెలంగాణ -ఢిల్లీ: 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది.  ఈ ఘటన 22 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు భారత పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వారికి నేడు యావత్ భారతదేశం నివాళులర్పిస్తోంది. పార్లమెంట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్‌, కేంద్రమంత్రులు సహా పత్రిపక్ష నేతలు అమరులకు నివాళులర్పించారు.
22 ఏళ్ల క్రితం డిసెంబరు 13న మన ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. తొమ్మిది మందిని పొట్టనబెట్టుకున్నారు. వారిని ధైర్యంగా ఎదుర్కొన్న భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో తమ ప్రాణాలు అర్పించిన వీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. వారి త్యాగాలను వృథా కానివ్వకూడదు. మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
నాడు పార్లమెంట్‌పై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది త్యాగాలు మరువలేనివి. ఈ దేశం వారికి రుణపడి ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో అన్ని దేశాలు ఐక్యంగా ఉండడం ఎంతో అవసరం – ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ దన్‌ఖడ్‌
పార్లమెంట్‌పై దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు. ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని తమ ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు చిరస్థాయిగా నిలిపోతాయి – ప్రధాని నరేంద్ర మోడీ

Spread the love