30న సలాబత్పూర్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు

  • బాన్స్వాడ డివిజన్ ధూప దీప నైవేద్య అర్చకుల సమావేశం
  • దేవస్థానం యొక్క భూమి కౌలు వేలంపాట,
    నవతెలంగాణ మద్నూర్: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణంలో ఈ నెల 30న మూడు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. ఈనెల 30న బాన్సువాడ డివిజనల్ పరిధిలోని బీర్కూర్ బాన్సువాడ నసురుల్లాబాద్ ఎల్లారెడ్డి పిట్లం నిజాంసాగర్ మమ్మద్ నగర్ పెద్ద కోటప్పగల్ జుక్కల్ బిచ్కుంద మద్నూర్ డోంగ్లి వీటి పరిధిలోని ధూప దీప, నైవేద్యం అర్చకుల ప్రత్యేక సమావేశాన్ని ఉదయం ఎనిమిది గంటలకు దేవస్థానం ఆవరణంలో నిర్వహించబడుతుందని తెలిపారు.
    అనంతరం 11 గంటలకు సలాద్బత్పూర్ ఆంజనేయస్వామి దేవస్థానం యొక్క హుండీ లెక్కింపు ఉంటుందని అదేవిధంగా దేవస్థానానికి చెందిన మద్నూర్ మండలంలోని సోనాల గ్రామ శివారు పరిధిలోని సాగుభూమి కౌలు వేలంపాట ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ అలాగే పరిశీలకులు బోధన్ డివిజన్ అధికారి పాల్గొంటారని తెలిపారు. ముఖ్యంగా డివిజనల్ పరిధిలో గల ధూప దీప నైవేద్య అర్చకులు సమయపాలన పాటించి సమావేశానికి తప్పక హాజరు కావాలని కోరారు. ఈనెల 30న నిర్వహించే మూడు ముఖ్యమైన కార్యక్రమాల పట్ల సలభత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో తగిన ఏర్పాట్టు చేస్తున్నట్టు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు.
Spread the love