గ్రేటర్‌ హైదరాబాద్‌లో రూ.3,50,65,450 సీజ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రూ.3,50,65,450 సీజ్‌– పలు నియోజకవర్గాల్లో కేసులు నమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ద్వారా భారీగా నగదు పట్టుకుంటున్నారు. తాజాగా మంగళవారం రూ.90,000ను పట్టుకోగా.. ఇప్పటివరకు 3,50,65,450 నగదును సీజ్‌ చేశారు. పోలీస్‌ అథారిటీ ద్వారా మంగళవారం రూ.4,90,470 స్వాధీనం చేసుకోగా, ఇప్పటివరకు 48,88,56,881 నగదును సీజ్‌ చేశారు. ఎఫ్‌.ఐ.ఆర్‌లు 12 నమోదు కాగా, ఇప్పటి వరకు 612 నమోదు చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ కింద ఇప్పటి వరకు 4,558 లైసెన్స్‌ ఆయుధాలను సేకరించారు. అలాగే సీఆర్‌పీసీలో ఇప్పటి వరకు 887 కేసులు నమోదయ్యాయి. మంగళవారం 16 బైండోవర్‌ చేయగా, ఇప్పటి వరకు 2,332 బైండోవర్‌ చేశారు. ఇప్పటి వరకు 2,321 నక్కాస్‌ ఆపరేషన్స్‌ చేశారు. అలాగే ఇప్పటి వరకు 2076 నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌లను నమోదు చేశారు. ఎంసీసీ కింద పబ్లిక్‌ ప్రాపర్టీస్‌లో మొత్తం 5,594 వాల్‌ రైటింగ్‌, 83,578 పోస్టర్లు, 29,188 బ్యానర్లు తొలగించారు. 90,101 విగ్రహాలను మూసేశారు. ప్రయివేటు ప్రాపర్టీల్లో 21,100 పోస్టర్లు, 5,230 బ్యానర్లు తొలగించారు. 22,446 విగ్రహాలను మూసేశారు. మొత్తం 30 అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించినట్టు గుర్తించారు. ఎక్సైజ్‌ శాఖ ద్వారా మంగళవారం 33 లీటర్ల లిక్కర్‌ను సీజ్‌ చేశారు. కార్వాన్‌ నియోజకవర్గంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే లంగర్‌ హౌస్‌చెక్‌ పోస్ట్‌ వద్ద ఎస్‌ఎస్‌టీ టీమ్స్‌ రూ.లక్ష, చార్మినార్‌ నియోజకవర్గంలోని పురానాపూల్‌ గుడ్‌ విల్‌ హోటల్‌ వద్ద రూ.1,52,000 సీజ్‌ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 9 కేసులు నమోదు కాగా.. యాకత్‌పుర 1, మలక్‌ పేట్‌ 5, నాంపల్లి 1, జూబ్లీహిల్స్‌ 1, ముషీరాబాద్‌ 1 నియోజకవర్గాల్లో సంబంధిత పార్టీ ప్రతినిధులపై కేసుల నమోదుకు చర్యలు తీసుకున్నారు.

Spread the love