ఫాక్స్‌కాన్‌పై కేటీఆర్‌ తప్పుడు ప్రచారం

– టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌కు రావాల్సిన కర్నాటక రాష్ట్రానికి తరలించాలంటూ డీకే శివకుమార్‌ ఫోక్స్‌కాన్‌ కంపెనీకి లేఖ రాసినట్టు మంత్రి కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సమస్యను పక్కదారి పట్టించేందుకు కేటీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ నుంచి డీకేతో మాట్లాడామనీ, ఆయన లేటర్‌హెడ్‌ ట్యాపర్‌ చేసినట్టు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారన్నారు. గ్రామ, బూతు స్థాయి నాయకుడిలా కేటీఆర్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను బదనాం చేసేలా ఆయన ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఫేక్‌ న్యూస్‌, మార్ఫింగ్‌ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఓయూలో బస్సు పెట్టి కర్నాటకకు రమ్మంటే కేటీఆర్‌ రాలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్‌ చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.

Spread the love