ఎన్నికల వ్యయ వివరాలు పకడ్బంధీగా నమోదు

– ఎన్నికల వ్యవయ పరిశీలకులు రాహుల్‌ పంజాబ్రావ్‌
నవతెలంగాణ-సుబేదారి
అభ్యర్థుల ఎన్నికల వివరాలను పక డ్బందీగా నిబంధనల మేరకు నమో దు చేయాలని ఎన్నికల పరిశీలకులురా హు ల్‌ పంజాబ్రావ్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్ర వర్తనా నియమావళి ఉల్లంఘనల పై వ చ్చే ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అక్రమనగదు, మధ్యం పంపిణీ జరకుం డా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు అసెం బ్లీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్ని కల వ్యయ వివరాల నమోదు పై సంబం ధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గ ప రిధిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అ భ్యర్థుల ఎన్నికల వివరాలను పకడ్బందీ గా నిబంధనమేరకు నమోదు చేయాలని ఎన్నికల పరిశీలకులు అన్నారు. శనివా రం సమీకృత కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో లో ఎన్నికల వ్యయ పరిశీల కులు రాహుల్‌ పంజాబ్రావ్‌ గవాండే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్త ప ట్నాయక్‌తో కలిసి హనుమకొండలో గల రెండు నియోజకవర్గాల ఎన్నికల వ్యయ వివరాల నమోదుపై సంబంధిత అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. వరంగల్‌ పశ్చిమ పరకాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలు, అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల నమోదు కోసం ఏర్పా టుచేసిన బందాలు వాటి పనితీరు తది తర అంశాలను జిల్లా ఎన్నికల అధికారి సిక్త పట్నాయక్‌ వివరించారు.ఎన్నికల కు సంబందించిన అన్ని రకాల టీమ్‌ లతో క్రమం తప్పకుండ సమావేశం నిర్వహిస్తు న్నామని, ఇప్పటికే శిక్షణ ను సిబ్బంది కి ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులు నమోదు కోసం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు స్టాటిక్‌ సర్వే లన్సు బందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు, వీడియో వ్యూయింగ్‌ బృం దాలు పకడ్బందిగా విధులు నిర్వహిం చా లన్నారు. ఎన్నికల సమయంలో నగదు బంగారం, వస్తువుల పంపిణీ జరగకుం డా అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఫిర్యాదులు సమాచారం తీ సుకుంటూ పకడ్బందీగా విధులు నిర్వ హించాలని అన్నారు. సహాయ వ్యయ అధికారులతో సమన్వయం చేసుకో వాలని, సహాయ వ్యయ పరిశీలన అధికారులు రిటర్నింగ్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఇన్‌కం టాక్స్‌, వాణిజ్య పన్నుల శాఖ, వ్య య పరిశీలన శాఖలు ఎన్నికల వ్యయం నమోదులో సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఎంసిఎంసి కమిటీ ద్వారా రోజువారి దిన పత్రికల్లో , లోకల్‌ ఛానెల్‌ లో వచ్చే పేడ్‌ న్యూస్‌ పై దష్టి సారించాలన్నారు. సోషల్‌ మీడియా పై పటిష్టంగా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీ లు సమావేశాలు నిర్వహించే సమయంలో వాటిని నిశితం గా రికార్డ్‌ చేయాలని, అక్కడ వినియో గించే ప్రతి వస్తు రేట్‌ చార్ట్‌ ప్రకారం అభ్యర్థి ఎన్నికల ఖాతాలో నమోదు జరిగే విధంగా నిబంధనలో మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రికార్డ్‌ అంత పారదర్శకంగా ఉండాలి అని అన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ శ్రద్ద శుక్ల, డీసివో నాగేశ్వరావు, డీసీపీ అబ్దుల్‌ బారి, ఐటి అధికారులు, విఎస్టి, ఎస్‌ఎస్టి, ఎంసిసి,ఎంసిఎంసి, టీమ్‌ల అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love