నవతెలంగాణ – తాడ్వాయి
తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీ వాడి గ్రామంలో సోమవారం రోజున కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూరెల్లి జ్యోతి నర్సింలు ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గ్రామంలో కంటి లోపాలు ఉన్నవారు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చిన్న గొల్ల రాములు టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు రమేష్ రావు డాక్టర్లు గ్రామస్తులు పాల్గొన్నారు