భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అందించాలి..

– భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అందించాలి
నవతెలంగాణ – తాడ్వాయి
భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అందించాలని ధర్మ సమాజ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేశారు తాడువాయి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో సోమవారం ధర్నా నిర్వహించి అనంతరం కార్యాలయం అధికారికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు చేతిలో ఉండాలని డిమాండ్ చేశారు గతంలో ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అందించాలని కోరామని తెలిపారు అయినా ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి పౌరుడికి రాజ్యాంగం గురించి తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాబు సాయికుమార్, నాయకులు భూపాల్, నిఖిల్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Spread the love