ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం

న్యూఢిల్లీ : ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పెంచిన ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇది 2023 డిసెంబర్‌ 31 వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. ఇటీవలి కాలంలో దేశంలో టమాట, ఇతర అహారోత్పత్తుల ధరలు అనుహ్యాంగా పెరుగుతూ వస్తోన్నాయి. ఉల్లి ధర కూడా భారీగా పెరుగొచ్చని ఆగస్ట్‌ తొలి వారంలో క్రిసిల్‌ ఇచ్చిన రిపోర్ట్‌తో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయినట్లు తెలుస్తోంది. ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా లభ్యతను మెరుపర్చడానికి ఈ చర్య తీసుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Spread the love