ఉక్రెయిన్‌ ప్రతిదాడి విఫలమౌతుందని

అమెరికా గూఢచార వర్గాల అంచనా : వాషింగ్టన్‌ పోస్టు
ఉక్రెయిన్‌ కొనసాగిస్తున్న ప్రతిదాడి స్థితి ‘విచారకరం’గా ఉన్నదని, అది సంవత్సరాంతానికల్లా క్రైమియా వైపు దూసుకుపోజాలదని అమెరికా గూఢచార వర్గాలు భావిస్తున్నట్టు వాషిగ్టన్‌ పోస్టు పేర్కొంది. ఆక్రమిత ప్రాంతాలను రష్యా ‘క్రూర నైపుణ్యం’తో పరిరక్షిస్తోందని అమెరికా గూఢచార వర్గాలు తయారు చేసిన నివేదిక విశ్లేషించినట్టు వాషింగ్టన్‌ పోస్టు రాసింది. ఈ నివేదిక గురువారం వాషింగ్టన్‌ పోస్టుకు అందిందని ఆ పత్రిక చెప్పుకుంది. ఆగేయ ప్రాంతంలోగల మెల్టీపోల్‌ ప్రధాన నగరాన్ని చేరుకోవ టంలో ఉక్రెయిన్‌ ప్రతిదాడి విఫలమౌతు ందని, క్రైమియాను రష్యా చేరేందుకు వీలుకల్పించే భూభాగాన్ని విడగొట్టే ప్రధాన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఈ సంవత్సరంలో ఉక్రెయిన్‌ కు సాధ్యపడదని ఆ నివేదిక తెలియజేసింది.
క్రైమియా 2014 నుంచి రష్యా ఆధీనంలోనే ఉంది.ఇందుకు ఒక రిఫరెండం ద్వారా ప్రజలు ఆమోదం తెలిపారు. అయితే క్రైమియాని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్‌ పదేపదే ప్రతిజ్ఞ లు చేస్తోంది. ఉక్రెయిన్‌ క్రైమియాను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే అజోవ్‌ సముద్ర తీరంలోని ప్రధాన నగరమైన మెల్టీపోల్‌ను ఆక్రమించుకోవాలి. అందు కోసం ఉక్రెయిన్‌ ఎన్ని దాడులు చేసినప్పటికీ ఉప యోగం ఉండటం లేదు. వాషింగ్టన్‌ పోస్టు రాసింది ఈమధ్యకాలంలో ప్రముఖ ఇన్వెస్ట్గేటివ్‌ జర్న లిస్టు, సెమౌర్‌ హెర్ష్‌ చెప్పిన దానితో పోలివుంది. గురువా రం ప్రచురించిన ఒక వ్యాసంలో ‘ఉక్రెయిన్‌ ఈ యుద్ధాన్ని గెలవలేదు’ అని ఒక గూఢచార అధి కారి అన్నట్టుగా హెర్ష్‌ పేర్కొన్నాడు. ఉక్రెయిన్‌ ప్రతి దాడి విఫలమౌతుందనే విషయాన్ని సిఐఏ అమెరికా విదేశాంగ కార్యదర్శికి తెలియజేసిం దనే సమాచారం తనకు ఉందని, ఇదంతా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, వ్లాడీ మీర్‌ జెలెన్స్కీ ఆడుతున్న నాటకమని, ఈ నాటకాన్ని బైడెన్‌ టీంలో కొందరు నమ్ముతున్నారని హెర్ష్‌ అన్నాడు. ఉక్రెయిన్‌ తన ప్రతిదాడిని జూన్‌ ఆరంభంలో మొదలెట్టింది. ఈ ప్రతి దాడిలో ప్రశ్చిమ దేశాల ఆయుధాలతోపాటు, వివిధ దేశాలలో సైనిక శిక్షణ పొందిన బ్రిగేడ్లు పాల్గొన్నాయి. దక్షిణంలోవున్న జపోర్జియే రాష్ట్రం లోని క్రైమియాను డోన్‌ బాస్‌ తో కలిపే భూభాగాన్ని విడగొట్టాలని ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రయత్నించినా విజయం సాధించలేకపోయింది. ఈ ప్రయత్నం లో ఉక్రెయిన్‌ 43వేల సైన్యాన్ని, 5వేల భారీ ఆయుధాలను పోగొట్టుకుంది. ఇలా విఫలం కావటానికి కారణం పశ్చిమ దేశాలు యుద్ధ విమానాలను, సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను సరఫరా చెయ్యకపోవటమేనని జెలెన్స్కీ పదేపదే నిందిస్తున్నాడు. ఈ ప్రతిదాడిని కొనసాగించాలా లేక వచ్చే వసంతకాలందాకా వేచిచూడాలా అనే విషయంపైన ఉక్రెయిన్‌ నాయక త్వంలో విబేధాలు ఉన్నాయి. ‘మొత్తంగా రంగంలోకి దూకి ఘోరంగా విఫల మయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోవటమో లేక నష్టాలను తగ్గించుకుని రాజకీయంగా అవమానకరమైన ఓటమిని అంగీకరించటమో తేల్చుకోవ లసిన స్థితిలో జెలెన్స్కీ ఉన్నాడు’ అని న్యూస్‌ వీక్‌ రాసింది.

Spread the love