ఆత్మాహుతి దాడిలో 44 మంది మృతి

నవతెలంగాణ – పాకిస్థాన్
వాయువ్య పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందగా, 200 మంది వరకు మరణించారు. ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లోని బజౌర్స్ ఖర్ పట్టణంలో జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్-ఫజల్ సంస్థకు చెందిన మతపరమైన సమ్మేళనం జరుగుతుండగా, ఓ వ్యక్తి తనను తాను పేల్చివేసుకున్నాడు. పేలుడు ధాటికి తీవ్ర విధ్వంసం నెలకొంది. శరీరాలు ఛిద్రమైపోయాయి. ఘటన స్థలంలో భీతావహ దృశ్యాలు కనిపించాయి. సాయంత్రం 4 గంటలకు ఈ పేలుడు సంభవించిందని క్షతగాత్రుల్లో ఒకరు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని, తేరుకుని చూశాక పొగ, దుమ్ము, ధూళి కమ్మేసిందని, తెగిపడిన అవయవాలతో ఆ ప్రదేశమంతా బీభత్సంగా మారిందని ఆదామ్ ఖాన్ అనే బాధితుడు వెల్లడించారు. కాగా, ఈ ఆత్మాహుతి దాడికి తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరపాలని జమియత్ ఉలేమా సంస్థ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రహ్మాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సీఎం అజామ్ ఖాన్ లను డిమాండ్ చేశారు.

Spread the love