20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

– 23 రోజులు, 17 సిట్టింగ్‌లు
– పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించా రు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్‌ ద్వారా పార్లమెంట్‌ సమావేశాల షెడ్యూల్‌ను వెల్లడించారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో సత్ఫలితాలు ఇచ్చే చర్చలు జరగడానికి కృషి చేయాలని అన్ని పార్టీలను కోరారు. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలు 23 రోజుల పాటు సాగుతుందని, 17 సిట్టింగ్‌లు ఉంటాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేశ్‌ మాట్లాడుతూ ప్రతిపక్షాలు నిరంతరం లేవనెత్తుతున్న ప్రజలకు ఆందోళన కలిగించే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం అనుమతినిస్తుందని ఆశిస్తున్నామని, వాటిపై ప్రధాని మౌనం పాటిస్తున్నారని అన్నారు. వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్‌ భవనంలో ప్రారంభమవుతాయని, తరువాత కొత్త భవనానికి తరలించాలని భావి స్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 28న నూతన పార్లమె ంటు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. అదే విధంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్‌కు చట్ట రూపం ఇచ్చేందుకు ఓ బిల్లును ప్రవేశపెట్టనున్నా రు. కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు కొత్త పార్లమెంటు భవనంలో కార్యాలయాలను కేటాయించారు. ముఖ్యమైన డిపార్ట్‌మెంట్ల కార్యాల యాలను కూడా తరలిస్తున్నా రు.కేంద్ర పౌర స్మృతిపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ జూలై 3న సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ శనివారం సమావేశం అయింది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ నివాసమైన 10 జనపథ్‌లో సమావేశం అయ్యారు. యుసిసిపై చర్చలో పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. జూలై 3న సమావేశానికి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, లా అండ్‌ జస్టిస్‌) పిలుపునిచ్చింది. యూసీసీపై సంబంధిత భాగస్వాములందరితోనూ స్టాండింగ్‌ కమిటీ చర్చించనుంది. బిజెపి రాజ్యసభ ఎంపి సుశీల్‌ మోడీ సారథ్యంలోని కమిటీ ఇందులోని 31 మంది ఎంపిలు, సభ్యులను తమతమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరింది.ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్‌లో పరిస్థితి వంటి అంశాల నుంచి ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. యుసిసి అమలుతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై తీవ్ర ప్రభావం పడుతుం దని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘెల్‌ వ్యాఖ్యానించారు. హిందూ-ముస్లిం డైనమిక్స్‌పై మాత్రమే ఎందుకు దృష్టి సారిస్తున్నారని, తమ రాష్ట్రంలోని గిరిజన జనాభాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. మతం కోణంలో నుంచి సమాజాన్ని రెండుగా చీల్చేందుకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ యూసీసీ చర్చ లేవనెత్తినట్టు విమర్శించారు.

Spread the love