రైతు పండించిన ప్రతి గింజకు 500 బోనస్ ప్రకటించాలి: గంగుల కమలాకర్

– కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది
– తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్
– కరీంనగర్ రైతు ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నవతెలంగాణ – కరీంనగర్ 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని.. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే  గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో  రైతు ధర్నా నిర్వహించారు..ఈ నిరసన కార్యక్రమంలో  ఎమ్మెల్యే గంగుల కమలాకర్,  మేయర్ సునీల్ రావు తో పాటు భారీ ఎత్తున రైతులు,బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మాట ఇచ్చిన ప్రకారం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, అన్ని రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు…తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని…అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు..రుణమాఫీ, రైతుబరోసా, మద్ధతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామన్నారు.హామీలేవీ నిలబెట్టుకోకపోవడం వల్లే మేము రైతుల పక్షాన ధర్నా చేస్తున్నాం.అన్నారు..మద్ధతుధరతో పాటు ప్రతి రైతు అకౌంట్లో ఎలాంటి నిబంధనలు లేకుండా క్వింటాలుకు రూ.500 రు బోనస్ వేయాలని డిమాండ్ చేసారు.. ఓట్లు డబ్బల పడగానే సీఎం రేవంత్ మాట మార్చాడని కేవలం సన్నరకానికే రూ.500 బోనస్ ఇస్తాననడం మోస పూరిత చర్య అన్నారు..కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను గుర్తించే విధానం లేదని..ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు వచ్చినా ఇప్పటి వరకు 33 లక్షల టన్నులే కొన్నారని. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతలేవని….తాము ఉన్నప్పుడు 95 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాంఅని గుర్తు చేసారు…తెలంగాణ లో పంట దిగుబడి తగ్గిందా? లేదంటే రైతులు ప్రయివేటుకు అమ్ముకున్నారా? వెళ్లడించాలని అన్నారు. అకాల వర్షాలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారని తడిచిన ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు..లేదంటే రైతు ఆగ్రహం చవి చూడక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్  ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య  కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, కరీంనగర్ పాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు సర్వర్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, పొన్నం అనిల్   బుర్ర తిరుపతి గౌడ్ మంద రాజమల్లు,గంగాధర చందు తదితరులు పాల్గొన్నారు.
Spread the love