చౌటుప్పల్ మండలంలో పోలైన 81.53 శాతం ఓట్లు…

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలంలో 26 గ్రామపంచాయతీలు చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు సోమవారం జరిగిన భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో 5 గంటల వరకు 75 పోలింగ్ బూతులలో మొత్తం 64,213 ఓట్లకు గాను 52,356 ఓట్లు 81.53% పోలైనట్లు ఇంకో గంట రెండు గంటల ఓట్ల పర్సంటేజీ ఇంకా తెలియాల్సి ఉందని చౌటుప్పల్ మండల తహసిల్దార్ శివకోటి హరికృష్ణ తెలిపారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి ప్రాథమిక పాఠశాలలో 52వ బూతులో మొత్తం 1329 ఓట్లకు గాను ఒకటే బూతు కేటాయించడంతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారీగా జనాలు క్యూలో గంటల తరబడి నిలుచొని ఓట్లు వేశారు. ఇక్కడ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 1200 ఓట్ల పైచిలుకు ఉండటంతో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు పెరిగాయి.ఓటర్లు గంటల తరబడి నిలబడటంతో ఓటు పై విరక్తి చెంది విసుకు చెందుతున్నారు.ఇకనైనా ముందు జరగబోయే ఎన్నికల్లో ఈ భుతును రెండుగా విడగొట్టి ఓటర్లను ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని ఓటర్లు వాపోతున్నారు.
Spread the love