హైదరాబాద్ : రాష్ట్రంలో బీఎడ్ కోర్సులో ప్రవే శాల కోసం గురువారం నిర్వహించిన ఎడ్‌సెట్-2023 రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎడ్ సెట్‌కు 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. వారిలో 27,495 (86.6 శాతం) మంది అభ్య ర్థులు హాజరయ్యారని వివరించారు. 4,230 మంది అభ్యర్థులు గైర్హాజర య్యారని పేర్కొన్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి విడతకు 10,562 మందిని కేటాయిస్తే, 8, 991 మంది, రెండో విడతకు 10,583 మందిని కేటాయించగా, 9,169 మంది, మూడో విడతకు 10,580 మందికి కేటాయిస్తే, 9,335 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఈ పరీక్ష ను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ టి కృష్ణారావు, ఎడ్‌సెట్ కో కన్వీనర్ పి శంకర్, కోఆర్డినేటర్ అలువాల రవి పర్యవేక్షిం చారని తెలిపారు. లింబాద్రి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీ లించారని పేర్కొన్నారు. ఈనెల 21న ఎడ్‌సెట్ ప్రాథమిక కీని విడుదల చేస్తామని తెలిపారు. 24వ తేదీ వరకు అభ్యంత రాలను స్వీకరిస్తామని వివరించారు.