ముంబయి : ప్రముఖ సరుకు సరఫరాదారు అయినా గతి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుత పండగ సీజన్లో డిమాండ్‌ను తట్టుకోవడానికి సామర్థ్యం పెంచుకున్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్లో వైట్ గూడ్స్, వినియోగదారుల ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణ డిమాండ్ పెరుగుతుందని.. దీన్ని తట్టుకోవడానికి సన్నద్దం అయినట్టు పేర్కొంది. సంవత్సరంలో ఎప్పుడైనా 20 శాతం ఎక్కువ కార్గో లోడ్లను నిర్వహించగలమని గతి లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గౌరీనాథ్ పేర్కొన్నారు. తమ సంస్థ 180 దేశాలలో నెట్వర్క్ కలిగి ఉందన్నారు. భారత్‌లోని 735 జిల్లాల్లో 19,800 పిన్కోడ్లకు డెలివరీ చేయగలమన్నారు.