కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కాదు

– మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ : కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులను అమర్చాలనే నిబంధనను తప్పనిసరి చేయడం లేదని కేంద్ర రోడ్లు, రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎఎంసీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్త క్రాష్‌ టెస్ట్‌ రూల్స్‌ను అమలు చేసిన తర్వాత.. కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధనలను ఆలోచిస్తామన్నారు. కారు ప్రమాదాలు జరిగిన సమయంలో మరణాలను తగ్గించేందుకు ఆరు బ్యాగులను అమర్చాలని ఇది వరకు కేంద్రం నిర్ణయించింది. దీన్ని ఈ ఏడాది అక్టోబర్‌ ఒకటి నుంచి అమలు చేయాలని భావించింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి ప్రకటన కార్ల కంపెనీలకు భారీ ఊరటను ఇచ్చింది. దేశంలోని అనేక వాహన తయారీ సంస్థలు ఇప్పటికే తమ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆరు బ్యాగ్‌ల నిబంధన అమలును వాయిదా వేస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యల్లో స్పష్టమవుతోంది. కానీ.. ఇది శాశ్వత నిర్ణయం కాదని తెలుస్తోంది.

Spread the love