ఎఐతో ఉద్యోగాలకు ముప్పు : ఐబీఎం

న్యూఢిల్లీ : చాట్‌జిపిటి, గూడుల్‌ బార్డ్‌ తరహా కృత్రిమ మేధా టూల్స్‌తో ఉత్పాదకత పెరిగినప్పటికీ ఉద్యోగులకు ముప్పు ప్రమాదం పొంచి ఉందని ఐబిఎం ఛైర్మన్‌, సీఈఓ అరవింద్‌ కృష్ణ ఉన్నారు. ఏఐ టూల్స్‌ రాకతో ముందుగా బ్యాక్‌ ఆఫీస్‌, వైట్‌ కాలర్‌ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తాను విశ్వసిస్తున్నానన్నారు. కృత్రిమ మేధా నాణ్యమైన జీవితాన్ని అందించగలదన్నారు. నూతన టెక్నాలజీని యాక్సెస్‌ చేసుకునేందుకు సంస్థలకు సాయపడేలా ఐబీఎం ఇటీవల జనరేటివ్‌ ఏఐ ప్లాట్‌ఫాంలతో కూడిన వేదిక వాట్సన్‌ఎక్స్‌ను ప్రవేశపెట్టింది. ఎఐ ప్రభావం తమ కంపెనీ ఉద్యోగులపై కూడా ఉండనుందన్నారు. దీంతో ఐబిఎంలోనూ ఉద్యోగాలు ఊడొచ్చని స్పష్టమవుతోంది.

Spread the love