లార్డ్స్‌ నుంచి ఎనిమిది విద్యుత్‌ వాహనాలు

న్యూఢిల్లీ : లార్డ్స్‌ ఆటోమోటివ్‌ కొత్తగా ఎనిమిది విద్యుత్‌ వాహనాల శ్రేణీని ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇందులో ఆరు త్రీ వీలర్‌, రెండు హైస్పీడ్‌ ఇవి స్కూటర్‌ మోడ ళ్లు ఉన్నాయని ఆ సంస్థ తెలి పింది. వీటి ధరల శ్రేణీ రూ. 49,999 నుంచి రూ.1,75,000గా నిర్ణయించినట్లు పేర్కొంది. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. దేశంలో గ్రీన్‌ మొబిలిటీ విప్లవంలో అత్యున్నత పాత్రను పోషించాలనే లార్డ్స్‌ ఆటోమేటివ్‌ లక్ష్యమని ఆ సంస్థ సిఇఒ సచ్చిదానంద్‌ ఉపాధ్యారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లో 267 డీలర్‌షిప్‌లతో 16,000 పైగా యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది.

Spread the love