అమెరికా బ్యాంక్‌లకు మరో దెబ్బ

– రేటింగ్‌ను తగ్గించనున్న ఫిచ్‌..!
బీజింగ్‌ : అమెరికన్‌ బ్యాంక్‌ల పరపతికి కోత పెట్టిన మూడీస్‌ బాటలోనే ఫిచ్‌ రేటింగ్స్‌ నిర్ణయం తీసుకోనుందని రిపోర్ట్‌లు వస్తోన్నా యి. త్వరలోనే మోర్గాన్‌ సాచేతో సహా డజన్ల కొద్ది బ్యాంక్‌ల పరపతిని తగ్గించనున్నట్లు ఫిచ్‌ హెచ్చరిం చింది. అగ్రరాజ్యం బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఆందోళనలు పెరుగుతున్నప్పటికీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనా అనేక ఒత్తిడీలు నెలకొని ఉన్నాయని విశ్లేషించింది. మూడీస్‌ ఇటీవల 10 చిన్న, మధ్య తరహా అమెరికన్‌ బ్యాంకుల క్రెడిట్‌ రేటింగ్‌లను తగ్గించి, కొన్ని పెద్ద యుఎస్‌ బ్యాంకుల క్రెడిట్‌ రేటింగ్‌ల కోతపై హెచ్చరించిన విషయం తెలిసిందే. గతేడాది అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో గందరగోళం నెలకొందని ఫిచ్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ఈ ఏడాది ప్రారంభంలోనూ మూడు, నాలుగు బ్యాంక్‌లు దివాలా అంచునకు చేరిన విషయం తెలిసిందే. ఆగస్ట్‌ తొలి వారంలో గ్లోబల్‌ రేటింగ్‌ ఎజెన్సీ మూడీస్‌ అమెరికకు చెందిన 10 బ్యాంక్‌ల పరపతికి కోత పెట్టింది. మరిన్ని బ్యాంక్‌ల రేటింగ్‌ను తగ్గిస్తామని హెచ్చరించింది. దేశంలోని కొన్ని అతిపెద్ద రుణదాతల స్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది. స్థూలంగా 27 బ్యాంక్‌లపై అంచనాలను విడుదల చేసింది.

Spread the love