Tuesday, May 13, 2025
Homeజిల్లాలువైద్య సహాయం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబం 

వైద్య సహాయం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబం 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట : మండల కేంద్రానికి చెందిన బొజ్జ మహేష్ (35) అంతుచిక్కని వ్యాధితో బాద పడుతున్నాడు . గత ఎనిమిది నెలలుగా చర్మం పగుళ్లు బొబ్బలు, రక్తం రావడం తగ్గకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. మొదట్లో చిన్నాచితక హాస్పిటల్ లో వైద్యం తీసుకున్న మహేష్ ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు కూడా ఎనిమిది సంవత్సరాల వయసులోపు వారే .కూలి నాలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే పేద కుటుంబానికి చెందిన  మహేష్ ఈ వ్యాధితో గత 8 నెలలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. బంధువులు, స్నేహితులు చాలినంత సహాయం చేసినప్పటికిని కొంత అప్పు చేసి కూడా వైద్యం కోసం ఖర్చు చేయడం జరిగిందని, మార్పు కనిపించలేదని చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలపడం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మరి కొంతకాలం చికిత్స పొందాలని ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో పిల్లలతో సహా ఆస్పత్రిలో భర్తను చూసుకుంటూ గడుపుతోంది. ఇప్పటికే చాలా అప్పులు చేశామని, ఇంకా ఏం చేయాలో తోచడం లేదని మహేష్ భార్య ఆవేదన చెందుతోంది. వైద్య పరంగా గాని ఆర్థికపరంగా కానీ దాతలు తమ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. వైద్యులు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమకు సహకారం అందించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాంకు వివరాలు: కెనరా బ్యాంక్  పసర బ్రాంచ్, బొజ్జ మహేష్, ఖాతా నంబర్ – 6774101001909, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్: CNRB0001923, సంప్రదింపు నంబర్:  9121408124 ఫోన్ పే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -