అక్టోబర్ 2 న జరిగే మెగా రక్తదాన  జయప్రదం చేయండి..

– డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా తొరూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో  మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ కుందూరి రాజేందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రక్తదానం చేయటం వల్ల ప్రజలకు కొన్ని అపోహలు ఉన్నాయి ఈ రక్త దానం చేయటం వల్ల ఎటువంటి అనుమానాలు అక్కరలేదు నిర్భయంగా పదిమందికి సహాయం చేసే రక్తదానం మనకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తo అవసరార్థులకు, మనం దానం చేసిన రక్తాన్ని, వారికిచ్చి వేలాదిమంది ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. రక్త దానం చేయటం వల్ల మనకు కూడా ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఈ రక్తదాన శిబిరంలో యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు,వర్తక సంఘ సభ్యులు, అన్ని కుల సంఘాల సభ్యులు చాంబర్ ఆఫ్ కామర్స్ తొర్రూరు సభ్యులు, పాల్గొని రక్త దానం చేసి ,జాతిపిత మహాత్మా గాంధీ కి ఘన నివాళులు అర్పిద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబా బాద్ డిసి మెంబరు తమ్మెరవిశ్వేశ్వరరావు, కమిటీ సభ్యులు రేగురి వెంకన్న ,డాక్టర్ పాలడుగు కిరణ్ కుమార్ ,తుమ్మేటి వెంకటరెడ్డి, లైన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ జి విజయపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love