ప్రగతి పనులలో బొమ్మలరామారాన్ని తీర్చిదిద్దుతాం

– అభివద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-బొమ్మలరామారం
అభివద్ధి పనులకు శంకుస్థాపనలు జరిపిన ప్రభుత్వ విప్‌ అలేర్‌ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి ఆదివారం రోజున మండలంలోని హాజీపురం, మల్యాల, మునీరాబాద్‌, బొమ్మలరామారం, సోలిపేట ,ప్యారారం, చీకటిమామిడి, గ్రామాల్లో రూ.14 కోట్ల 85 లక్షల విలువైన పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల అభివద్ధి కొరకు పరితపించే ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ రైతుబంధు రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని రైతును రాజులు చేయాలని ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని ఆమె అన్నారు. ప్రజల అభివద్ధి సంక్షేమ లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ సారధ్యంలో ప్రభుత్వ విప్పు ప్రగతి పనుల్లో బొమ్మలరామారం తీర్చిదిద్దుతానని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు.ఇటివలే కాంగ్రెస్‌ పార్టీ తుక్కుగూడ సభలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక జాతీయ పార్టీ అని, జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి కానీ, రాష్ట్రానికి ఒక విధానం ప్రకటిస్తున్నారంటే ఇది చౌకబారు రాజకీయమేనని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్‌ పార్టీ డ్రామా చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ,సింగల్‌ విండో చైర్మన్‌ బాల్‌ నరసింహ,మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రామిరెడ్డి, సర్పంచులు నవీన్‌ గౌడ్‌, మచ్చ వసంత శ్రీనివాస్‌ గౌడ్‌,కవిత వెంకటేష్‌ గౌడ్‌,అశోక్‌, హారిక లక్ష్మారెడ్డి,రమాదేవి రామ్‌ రెడ్డి, అశోక్‌ నాయక్‌,గణేష్‌, దామోదర్‌,లక్ష్మారెడ్డి, వంగ మధుసూదన్‌ రెడ్డి,రామకష్ణ, నవీన్‌ బోనకుర మల్లేష్‌, కట్ట శ్రీకాంత్‌, ఉపేందర్‌, మహేష్‌, గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love