ప్రభుత్వ ఉద్యోగం పై మక్కువతో… రూ.20 లక్షల ప్యాకేజీ వదులుకున్న యువకుడు

– కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన అరవింద్

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని హాస కొత్తూర్ గ్రామానికి చెందిన రాజుల అరవింద్ ఇటీవల వెల్లడించిన కానిస్టేబుల్స్ ఫలితాల్లో కొలువు సాధించాడు. అయితే అరవింద్  తనకు ప్రభుత్వ ఉద్యోగం పై ఉన్న మక్కువతో తాను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. ఎంటెక్  చదివి ప్రస్తుతం బెంగుళూర్ లో సంవత్సరానికి రూ.20 లక్షల ప్యాకేజీతో  డిజైన్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.ఉద్యోగంలో కొనసాగుతూనే  పట్టు వదలకుండా కానిస్టేబుల్ జాబ్ సాధించడం ద్వారా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఈసారి గ్రామంలో కానిస్టేబుల్ కొలువు సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ…. తల్లి దండ్రులు వ్యవసాయ పనులు చేసి నన్ను ఇంత వాడిని చేశారని, తల్లి దండ్రులకు మరింతాగా గౌరవము తెచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపాడు. కాగా అరవింద్ ను శుక్రవారం యింప్యాక్ట్ ఉత్తమ ట్రైనర్ అవార్డ్ గ్రహీతలు  ఉట్నూర్ నరేష్, మలవత్ పావని, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సిబ్బంది శాలువాతో సత్కరించి అభినందించారు.
Spread the love