నవతెలంగాణ-గంగాధర : గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామంలో మరణించిన రెండు పేద కుటుంబాలకు ఆ గ్రామ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. గత 5 ఏళ్లుగా గ్రామంలో ఏ కారణంతో ఎవరు మరణించిన ఆ మృతుల కుటుంబ సభ్యులకు కొత్త జైపాల్ రెడ్డి మిత్ర మండలి పక్షాన ఆ గ్రామ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ మానవత ధృక్పతాన్ని చాటుకుంటున్నారు. గ్రామానికి చెందిన దేవుసాని బాలయ్య, పాళోజి లక్ష్మి ఇటీవల మరణించగా ఆయా మృతుల కుటుంబాలను విజేందర్ రెడ్డి బుధవారం పరామర్శించి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. సర్పంచ్ వెంట గ్రామ నాయకులు పూదరి రవి, బొల్లి గణేష్, గుణ శేఖర్, అలిశెట్టి బాబు, పాళోజి మల్లేశం, బచ్చయ్యచారి పాల్గొన్నారు