స్వచ్ సర్వేక్షన్ 2023లో మంచి ర్యాంకుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

charset=InvalidCharsetId 0; jpegRotation: 0; fileterIntensity: 0.000000; filterMask: 0;

– 18 వ డివిజన్ కార్పొరేటర్ బాదే అంజలిదేవి

నవతెలంగాణ-యైటింక్లైన్ కాలనీ: సచ్చ సర్వేక్షన్ 2023 లో మంచి ర్యాంకు సాధించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని 18వ డివిజన్ కార్పొరేటర్ బాధే అంజలీదేవి అన్నారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ కార్యక్రమంలో భాగంగా బుధవారం రామగుండం మేయర్, కమిషనర్ ఆదేశాల మేరకు 18వ డివిజన్లో సిటిజన్ ఫీడ్ బ్యాక్ కార్యక్రమం నిర్విహించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసుల నుండి అభిప్రాయాలు స్వీకరించి ఫీడ్బ్యాక్ చేసారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఫీడ్బ్యాక్ ఇచ్చారు.స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కార్పొరేషన్ అధికారుల దృష్టికి గానీ మా దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సానిటరీ సూపర్వైజర్ అడుప సోమేష్ ఇతర సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Spread the love