అర్ధాంతరంగా నిలిచిపోయిన సిసి కాలువ..

– రైతులకు అందని సాగునీరు..
నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం  కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల మధ్య గల సీసీ కాలువ ను అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధించి అధికారులకు తెలియ చేసిన వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాగేపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. గతంలో రైతుల సౌకర్యార్థం కల్యాపూర్ నుంచి కూనేపల్లి వరకు అప్పటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సిసి కాలువను పూర్తి చేయగా, కూనేపల్లి నుంచి బాగేపల్లి గ్రామం మధ్య వరకు సిసి కాలువ నిర్మించి వదిలివేయడంతో సుమారు రెండు వందల ఎకరాల కు సాగునీరు అందడం లేదని వారు పేర్కొన్నారు. కేవలం 500 మీటర్ల సీసీ కాలువను పూర్తి చేసినట్లయితే బాగేపల్లి గ్రామస్తుల కు సంబంధించిన 200 ఎకరాలు సాగు అవుతాయని వారుపేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కానీ, నీటిపారుదల శాఖ అధికారులు కానీ వెంటనే స్పందించి ఇట్టి సీసీ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానిక రైతాంగం కోరుతున్నారు.

Spread the love