8వ కాలనీలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

నవతెలంగాణ -యైటింక్లైన్ కాలనీ: 8వ కాలనీలోని శ్రీవాణి ప్లే స్కూల్ లో బీజేపీ నాయకులు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ మన దేశ సంస్కృతి,సాంప్రదాయానికి ప్రతీక ఈ రక్షాబంధన్ అని,నేను నీకు రక్షా,నువ్వు నాకు రక్షా మనిద్దరం దేశానికి రక్షా అనుకుంటూ ఒకరికొకరు రక్షాబంధన్ ధరించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులుమూకిరి రాజు, ఆకుల శశికుమార్,మారేపల్లి శ్రీనివాస్,ఐలవేని అనిల్ కుమార్,ఆకుల కుమార్ గౌడ్,తాండ్ర యుగేందర్, ప్రిన్సిపాల్ మానస, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love