అన్ని గ్రామాల్లో యూత్ కమిటీలు పూర్తి చేయాలి

– బీఆర్ఎస్ యూత్ నియోజక వర్గ ఇంచార్జ్ బంధారపు అజయ్ కుమార్ 
నవతెలంగాణ-గంగాధర : చొప్పదండి నియోజక వర్గంలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లో యువజన విభాగం కమిటీలను త్వరగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ యూత్ నియోజక వర్గ ఇంచార్జ్ బంధారపు అజయ్ కుమార్ పిలుపు నిచ్చారు.  గంగాధర మండల యువజన విభాగం అధ్యక్షుడు సుంకె అనిల్ అధ్యక్షతన బూరుపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూత్ విభాగం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా తిరిగిప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తదని,  ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుు సుంకె అనిల్, మారం యువరాజ్,  ఆరెపల్లి ప్రశాంత్, లక్ష్మారెడ్డి, పంజాల శ్రీనివాస్, బోయినిపల్లి కట్ట గోవర్ధన్, గడ్డం లక్ష్మారెడ్డి గార్లు పాల్గొన్నారు.
Spread the love