దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది: ఎమ్మెల్యే

నవతెలంగాణ -శంకరపట్నం
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ అన్నారు. శంకరపట్నం మండల పరిధిలోని వంకాయ గూడెం పరిధిలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వికలాంగుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రసమయి బుధవారం వికలాంగులకు పెరిగిన ప్రోసిడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేదని కానీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందని వికలాంగులకు 4016 ల రూపాయలు పెంచిందని ఆయన తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, బీడీ కార్మికులకు పింఛన్, మిషన్ భగీరథ, వంటి పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 40 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని తమ పార్టీ 9 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు. దళితుల అభివృద్ధికి కాంగ్రెస్ ముసలి కన్నీరు కారుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.2024 లొ మూడోసారి ముచ్చటగా బిఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎండి బషీరుద్దీన్, ఎంపీపీ ఉమ్మంతల సరోజన, తాసిల్దార్ అనుపమ, జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి,వైస్ ఎంపీపీ పులికోట రమేష్, సొసైటీ చైర్మన్లు సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ గ్రామాల ప్రజలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love