నవతెలంగాణ-వీర్నపల్లి : వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండ గ్రామంలో సోమవారం పోడు భూముల వివాదంలో చోటు చేసుకుందని సమచారం రావడంతో హుటాహుటిన పోలిసులు తరిలి వెళ్లి కర్రలతో దాడులు చేసుకుంటున్న ఇద్దరినీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దాడులు చేసుకుంటున్న ఇద్దరి అడ్డు తప్పించి ప్రాణాలను కాపాడి గాయాలు అయినా ఇద్దరిని అంబులెన్స్ ఎక్కించి అసుపత్రికి తరలించారు. దాడులు చేసుకుంటున్న సమస్య పరిష్కారం అవుతుందా ఏదైనా ఉంటే మాట్లాడుకొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి అని ప్రజలకు తెలిపారు. ఇద్దరి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ను ఎస్ ఐ నవత, ప్రజా ప్రతినిధులు అభినందించారు.