నవతెలంగాణ-హైదరాబాద్
మిషన్‌భగీరథ కార్పొరేషన్ వైస్‌చైర్మెన్‌గా బీఆర్‌ఎస్ నేత ఉప్పల వెంకటేష్ గుప్తా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్‌లోని భగీరథ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త , ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం. కపాకర్‌రెడ్డి రాష్ట్ర ఏవిఓపీఏ అధ్యక్షులు మలిపెద్ది శంకర్, ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వెంకటేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే ఖర్‌రావు మానసపుత్రిక అయిన మిషన్ భగీరథకు వైస్ చైర్మన్‌గా నియ మితులవడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి వసతిని అందించడం గొప్ప విషయమని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ఈపథకం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ పథకాన్ని మరింత పటిష్టంగా అమలుచేస్తామని హామీ ఇచ్చారు.