- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట
అమ్రాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ని సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి, సీబీఎం ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, స్టాప్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, సమయపాలన పాటించి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ దావఖనాల బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్యులను ఆదేశించారు.
- Advertisement -



