- Advertisement -
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నవతెలంగాణ-రామారెడ్డి
రామారెడ్డి మండలంలోని కామారెడ్డి నియోజకవర్గ గ్రామాల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని మంగళవారం ప్రభుత్వ సలహాదారు శ్రేణులకు సూచించారు. మండలంలోని అన్నారం, తోపాటు పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా అన్నారం గ్రామానికి చెందిన చింత క్రింది లతా శ్రీనివాస్ లను కాంగ్రెస్ పార్టీ తరఫున అధిష్టానం బలపరిచినట్లు మోహన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -


