పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ది క్రూర దాడి

Israel's brutal attack on Palestine– వందలాది పసివాళ్లను చంపేయడం దుర్మార్గం
– సహజవనరులపై పట్టు కోసమే నెతన్యాహుకు అమెరికా వత్తాసు: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.అరుణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సహజవనరులు పుష్కలంగా ఉన్న పశ్చిమాసియాపై పట్టు సాధించడంలో భాగంగా ఇజ్రాయిల్‌కు పెట్టుబడిదారీ దేశాలు మద్దతు పలుకుతున్నాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.అరుణ్‌కుమార్‌ విమర్శించారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడిని క్రూరమైనదిగా వ్యాఖ్యానించారు. పైగా, పాలస్తీనీయులపైనే పెద్ద ఎత్తున విష ప్రచారం జరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. చారిత్రక పరిణామాలను చూడకుండా పాలస్తీనీయులదే తప్పు అని చిత్రీకరించడం తగదన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పాలస్తీనాపై ఇజ్రా యిల్‌ యుద్ధం- కారణం- పరిష్కారం అనే అంశంపై వెబినార్‌ నిర్వహిం చారు. దీనికి ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అరబ్‌ దేశాల్లో పెరుగుతున్న సోషలిస్టు భావజాలాన్ని తొక్కిపెట్టేందుకు ఆ ప్రాంతంలో తమకు అనుకూలమైన దేశం, ప్రభుత్వం ఉండాలనే, అపారమైన సహజవనరులను కొల్లగొట్టాలనే ఎత్తుగడలో భాగంగానే సామ్రాజ్యవాదులు ఇజ్రాయిల్‌కు వత్తాసు పలుకుతూ వస్తున్న తీరును వివరించారు. గాజాలోని ఆస్పత్రిపై దాడిలో 500 మందికిపైగా చనిపోయారనీ, వందలాది మంది క్షతగాత్రులు, మృతులు శిథిలాల కింద ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల ఏడో తేదీ నుంచి ఇప్పటిదాకా 51 సార్లు దాడులు జరిగాయనీ, అందులో 3,400 మందికిపైగా పాలస్తీ నీయులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. హమాస్‌ చేసిన దాడిలో తమ పౌరులు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున చనిపోయారనీ, దానికి ప్రతీకారంగానే పాలస్తీనీయులపై దాడులు చేస్తున్నా మని చెప్పడంలో పూర్తి వాస్తవం లేదన్నారు. అవకాశం కోసం చూస్తూ సమయం దొరికిందని తమ పైశాచికత్వాన్ని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నదన్నారు. ఇజ్రాయిల్‌ దాడిలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు చొప్పున పాలస్తీనా పిల్లలు చనిపోతున్నారని వాపో యారు. పైగా, పాలస్తీనీయులపై ఇంగ్లాండ్‌, అమెరికాలోని యూదు మత చాంధసవాసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గతంలో 33 శాతం జనాభా ఉన్న ఇజ్రాయిల్‌ దేశస్తులకు 55 శాతం భూమిని, పాలస్తీనాకు 42 శాతం ప్రాంతాన్ని, యూదులు, క్రిస్టియన్లు, ముస్లింల పవిత్రస్థలాలున్న జెరూ సలెం ప్రాంతంలోని మూడు శాతం భూమిని అంతర్జాతీయ భూభాగంగా ఉంచేలా జరిగిన ఒప్పందాన్ని వివరించారు. కానీ, తదనంతర కాలంలో ఇజ్రాయిల్‌ దేశం పాలస్తీనాను ఆక్రమించుకుంటూ పోయిందనీ, 1947-49 మధ్యలో పాలస్తీనాలో ముఖ్యమైన 500 పట్టణాలు, గ్రామాలను మొత్తంగా 78 శాతం భూభాగాన్ని ఇజ్రాయిల్‌ ఆక్రమించుకున్నదని చెప్పారు. తమ భూభాగాన్ని రక్షించుకునే క్రమంలోనే పాలస్తీనా లిబరేషన ఆర్గనైజే షన్‌(పీఎల్‌ఓ) పుట్టుకొచ్చిందని గుర్తుచేశారు. ల
శాంతియుత పోరాటానికి ఇజ్రాయిల్‌ తలొగ్గకపోవ ఙడంతో సాయుధ పోరాటం ద్వారానే తమ దేశాన్ని రక్షించుకోవాలనే దాని నుంచే పలు సంస్థలు పుట్టుకొచ్చా యన్నారు. అందులో ఒకటే హమాస్‌ అన్నారు. గాజా ప్రాంతంలో హమాస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఇజ్రాయిల్‌, పాలస్తీనా ప్రాంతం యూదులకు మాత్రమే చెందిందనే విషయంలో వాస్తవం లేదని ఇజ్రాయిల్‌లోని ప్రఖ్యాత టెల్‌అవీవ్‌ విశ్వావిద్యాల యంలో ప్రొఫెసర్లు, ఆర్కిటెక్ట్‌లు రాసిన పుస్తకాలను అధ్యయనం చేస్తే అర్థమవుతుం దన్నారు. యూదులు అక్కడి వారు అని చెప్పడానికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తప్ప చారిత్రక ఆధారాలు లేవన్నారు.

Spread the love