– అందుకే హింసను ప్రోత్సహిస్తోంది : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నైరాశ్యంలో కూరుకుపోయిందని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అందుకే అది హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే వీఎమ్ అబ్రహం తదితరులతో కలిసి మంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డిపై హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ రాష్ట్ర నేతల మాటలు, చర్యలు చూసి ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే తయారవుతున్నారని విమర్శించారు. ప్రజలను ఒప్పించి, మెప్పించాలి తప్పితే దాడులు సరికాదని హితవు పలికారు. నాగం జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రాంతీయ పార్టీలతోనే నేతలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరటమనేది ఓ పాలపొంగులాంటిదని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ (కాంగ్రెస్‌లో) ఉదయం పార్టీలో చేరితే సాయంత్రానికల్లా టిక్కెట్ ఇచ్చేస్తు న్నారనీ, తనకు మాత్రం పాపులారిటీ లేదంటూ పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రావుల మాట్లాడుతూ… ప్రజా సేవ అనేది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమనీ, అందుకే తాను ఆ పార్టీలో చేరానని చెప్పారు. పాలమూరు రాజకీయాల్లో అందరమూ కలిసి కట్టుగా పని చేస్తామని తెలిపారు.