Thursday, December 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకుప్పకూలిన హెలికాప్టర్‌..ఐదుగురు మృతి

కుప్పకూలిన హెలికాప్టర్‌..ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై ఘోర ప్రమాదం జరిగింది. బరాఫు క్యాంపు సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు విదేశీ పర్యాటకులు, ఒక డాక్టర్, టూరిస్ట్ గైడ్, పైలట్ సహా ఐదుగురు మరణించారు. పర్వతంపై ఉన్నవారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు టాంజానియా పౌర విమానయానశాఖ తెలిపింది. ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -