వాషింగ్టన్ డీల్ తో లెబనాన్‌పై పెనుభారం అమలు అసాధ్యమంటున్న విశ్లేషకులు
నిరాయుధీకరణకు హిజ్బుల్లా ‘నో’ సేనల మోహరింపు
కొనసాగుతుంది : ఇజ్రాయిల్
బీరుట్ : వాషింగ్టన్‌లో ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య కుదిరిన భద్రతా సంబంధమైన ఒప్పందం హిజ్బుల్లా-ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించడానికి బదులు ప్రతిష్టంభనను మరింత పెంచేందుకు దోహదపడేలా కన్పిస్తోంది. ఎందుకంటే దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ సేనలు వైదొలగడాన్ని హిజ్బుల్లా నిరాయుధీకరణతో ఈ ఒప్పందం ముడిపెడుతోంది. ఇది జరిగే పని కాదని ప్రాంతీయ విశ్లేషకులు, రాజకీయ నేతలు తేల్చి చెబుతున్నారు. నిరాయుధీకరణ ప్రతిపాదనను హిజ్బుల్లా పూర్తిగా తోసిపుచ్చింది. పైగా ఆయుధాలను విడనాడేలా హిజ్బుల్లాను నయానో భయానో ఒప్పించే శక్తి లెబనాన్ ప్రభుత్వానికి లేదు. నిరాయుధీకరణకు హిజ్బుల్లా ససేమిరా అంటున్న నేపథ్యంలో దక్షిణ లెబనాన్‌లో తన సైనిక దళాల మోహరింపును ఇజ్రాయిల్ కొనసాగిస్తుంది.
బలవంతంగా రుద్దిన పరిష్కారం
ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ మార్చి 2న టెల్ అవీవ్‌పై హిజ్బుల్లా దాడులు చేసింది. వీటికి ప్రతిగా లెబనాన్‌పై ఇజ్రాయిల్ కూడా పోరు ప్రారంభించింది. ఘర్షణల నివారణ కోసం ఇజ్రాయిల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అంతిమంగా లెబనాన్‌ను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే ఇచ్చిన హామీలను అది పూర్తిగా నెరవేర్చలేకపోతోంది. మరోవైపు తన సార్వభౌమత్వాన్ని తిరిగి పొందలేకపోతోంది. లెబనాన్ రాజకీయ వాస్తవికతలు కూడా ఒప్పందానికి విరుద్ధంగానే ఉన్నాయి. దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న శక్తివంతమైన సాయుధ గ్రూపు హ్పుి£్బల్లాతో ఘర్షణకు దిగాలని ఈ ఒప్పందం లెబనాన్‌ను కోరుతోంది. ‘అసలు ఇది ఒప్పందమే కాదు. బలవంతంగా రుద్దిన పరిష్కారం’ అని ఓ సీనియర్ లెబనాన్ నేత వ్యాఖ్యానించారు.
కొరవడిన సమతూకం
హిజ్బుల్లా లను నిరాయుధులను చేయడానికి లెబనాన్ సైన్యానికి తగిన నిర్మాణం కానీ, సామగ్రి కానీ లేవు. అసలు ఒప్పందం రూపకల్పనలోనే సమతూకం లోపించింది. అది లెబనాన్‌పై మోయలేని భారం మోపింది. ఇజ్రాయిల్ సేనల ఉపసంహరణకు గ్యారంటీ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇజ్రాయిల్ సేనలు దక్షిణ లెబనాన్‌లో నిరవధికంగా తిష్ట వేసుకొని ఉండడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తోంది. ఒప్పందం పుడుతూనే చనిపోయిందని, ఆచరణ సాధ్యం కాని షరతులపై ఆధారపడి ఉన్నందున నిర్మాణ పరంగా లోపభూయిష్టంగా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ ఇప్పటికే ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఓ బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసింది. ఒప్పందంలోని నిబంధనల కారణంగా ఈ బఫర్ జోన్ దీర్ఘకాలం కొనసాగి దానికి దౌత్యపరమైన చట్టబద్ధత లభించే ప్రమాదం ఉంది. అంటే ఇది ఇజ్రాయిల్‌కు రాజకీయ బహుమతిగా ఉపయోగపడుతుంది.
లెబనాన్ స్థిరత్వాన్ని దెబ్బతీసే నిబంధనలు
హిజ్బుల్లాలను నిరాయుధులను చేసే సామర్ధ్యం లెబనాన్‌కు లేదన్న విషయం ఇజ్రాయిల్‌కు తెలియనిది కాదు. హిజ్బుల్ల్లాపై ఇజ్రాయిల్ జరిపిన సైనిక చర్యలో ఇప్పటి వరకూ నాలుగు వేల మంది మరణించగా పది లక్షల మంది నిరాశ్రయుల య్యారు. ఒప్పందాన్ని ఇజ్రాయిల్, లెబనాన్ స్వాగతించగా అది చెల్లుబాటు కాదని హిజ్బుల్ల్లా చీఫ్ నయీమ్ ఖాసెమ్ ఎద్దేవా చేశారు. లెబనాన్ నుంచి ఇజ్రాయిల సేనలు వైదొలిగే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హిజ్బుల్లాతో బలవంతంగా నిరాయుధీకరణ చేయించేందుకు జరిపే ఏ ప్రయత్నమైనా మతపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. ‘ఒప్పందం కుదిరినంత మాత్రాన హిజ్బుల్లా కనుమరుగవదు. ఇజ్రాయిల్ సేనలు లెబనాన్ నుంచి వైదొలగవు’ అని ఓ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. హిజ్బుల్లా నిరాయుధీకరణకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఒప్పందం అమలు ఆధారపడి ఉంటుంది. ఒప్పందంలో పొందుపరచిన నిబంధనలు లెబనాన్ అంతర్గత స్థిరత్వాన్ని పేల్చివేయగల పేలుడు పదార్థాల వంటివన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొరవడిన సమతూకం
హిజ్బుల్లా లను నిరాయుధులను చేయడానికి లెబనాన్ సైన్యానికి తగిన నిర్మాణం కానీ, సామగ్రి కానీ లేవు. అసలు ఒప్పందం రూపకల్పనలోనే సమతూకం లోపించింది. అది లెబనాన్‌పై మోయలేని భారం మోపింది. ఇజ్రాయిల్ సేనల ఉపసంహరణకు గ్యారంటీ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇజ్రాయిల్ సేనలు దక్షిణ లెబనాన్‌లో నిరవధికంగా తిష్ట వేసుకొని ఉండడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తోంది. ఒప్పందం పుడుతూనే చనిపోయిందని, ఆచరణ సాధ్యం కాని షరతులపై ఆధారపడి ఉన్నందున నిర్మాణ పరంగా లోపభూయిష్టంగా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ ఇప్పటికే ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఓ బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసింది. ఒప్పందంలోని నిబంధనల కారణంగా ఈ బఫర్ జోన్ దీర్ఘకాలం కొనసాగి దానికి దౌత్యపరమైన చట్టబద్ధత లభించే ప్రమాదం ఉంది. అంటే ఇది ఇజ్రాయిల్‌కు రాజకీయ బహుమతిగా ఉపయోగపడుతుంది.
ఇజ్రాయిల్‌కు వరంగా మారిన అమెరికా వైఖరి
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న పోరును ముగించేందుకు చేస్తున్న దౌత్య ప్రయత్నాలకు లెబనాన్ కీలకం అవుతోంది. లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ సేనలు వైదొలగాలని, అక్కడ కూడా పోరు నిలిచిపోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్‘ హిజ్బుల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలకు అమెరికా ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంటోంది. దీంతో అక్కడ ఇజ్రాయిల్‌కు మరింత స్వేచ్ఛ లభించి దాని ఆగడాలకు అంతూ పంతూ లేకుండా పోతోంది. లెబనాన్ భూభాగంలో ఇజ్రాయిల్‌కు ఎలాంటి హక్కులు లేవని వాషింగ్టన్ ఒప్పందం చెబుతోంది. అయితే హిజ్బుల్లా సహా ప్రభుత్వేతర సాయుధ గ్రూపులు ఆయుధాలు విడనాడితేనే దక్షిణ ప్రాంతంలో లెబనాన్ సైన్యానికి పట్టు ఉంటుందని తెలిపింది. ‘ హిజ్బుల్లాలు, ఇతర ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను పూర్తిగా విడనాడే వరకూ, లెబనాన్ వైపు నుంచి మాకు ఎలాంటి ముప్పు లేనంత వరకూ మేము దక్షిణ ప్రాంతంలో మా సైన్యాన్ని మోహరిస్తూనే ఉంటాం’ అని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.