Tuesday, July 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజులై 2న క్యాబినెట్‌ ‌భేటీ

జులై 2న క్యాబినెట్‌ ‌భేటీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. హైదరాబా ద్‌లోని డాక్టర్ బీఆర్. అంబేద్క ర్‌ సచివాల యంలో జరగనున్న 34వ సమావేశానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి మండలిలో చర్చించే ఎజెండా అంశాలను అన్ని విభాగా లు తెలుగు అనువాదంతో సహా సర్క్యులేషన్ ద్వారా ఆమోదించి, జులై ఒకటిన మధ్యాహ్నం ఒంటి గంట లోపు జనరల్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపాలని ఆదేశించారు. ఎలాంటి ఎజెండా అంశాలు లేకపోయినా ‘నిల్’ రిపోర్టును సమయానికి పంపాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులందరూ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఉత్తర్వులో ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -