Wednesday, July 1, 2026
E-PAPER
Homeజాతీయంచిన్న మొత్తాల పొదుపు పథకాలపై చిన్నచూపు

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చిన్నచూపు

- Advertisement -

తొమ్మిదోసారి వడ్డీ రేట్లు యథాతథం
న్యూఢిల్లీ : చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఈ పొదుపు పథకాలపై వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమలయ్యే రెండో త్రైమాసికపు వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం విడుదల చేసింది. వరుసగా తొమ్మిదో త్రైమాసికం పాటు ఎటువంటి మార్పులు చేయకుండా పాత రేట్లనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రాచుర్యం పొందిన సుకన్య సమృద్ధి యోజన పథకానికి 8.2 శాతం వడ్డీ వర్తించనుంది. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌)‌కు 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌‌సీ)కు 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్రకు 7.5 శాతం, మంత్లీ ఇన్కమ్ సేవింగ్స్ స్కీమ్ కు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా.. మూడేళ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీని ప్రభుత్వం కొనసాగిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికి పాత రేట్ల ప్రకారమే ప్రయోజనం అందడంతో పొదుపుదారులకు మరోసారి నిరాశ ఎదురయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -