– ఓటరుకు నోటా ఆయుధం
నవ తెలంగాణ- సిరిసిల్ల:
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో సరైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది శాసనసభ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతుంది ఏటా నూతన ఓటర్లు నమోదు అవుతూనే ఉన్నారు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వారి చరిత్ర గుణగణాలను చూసి ఓటు వేస్తాం అందులో నచ్చని వారు ఉంటే తిరస్కరించే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది
– ఓటర్లకు కల్పించిన అవకాశం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటాను ఏర్పాటు చేశారు అభ్యర్థులకు ప్రతి ఓటు విలువైనదే గతంలో అభ్యర్థులు నచ్చకుంటే మిన్నకుండేవారు 2014లో ఎన్నికల సంఘం 14 ప్రవేశపెట్టింది పోటీ చేసే అభ్యర్థులు నచ్చకుంటే దీనిని వినియోగించుకునే అవకాశం ఇవ్వడంతో చాలామంది పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు
– ఎప్పటినుంచో తిరస్కరణ అమల్లో…
వాస్తవానికి అభ్యర్థులు ఎవరు నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది పోలింగ్ బూత్ లోని ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్లి దీనికోసం 17 ఏ ఫారం తీసుకొని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు రహస్య బ్యాలెట్ విధానానికి ఇది విరుద్ధమని ఓటరు భద్రతా దృష్ట్యా ఇది సరైన పద్ధతి కాదని వ్యతిరేకత ఉండేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో 10 ఎన్నికల సంఘం తీసుకొచ్చింది ఈవీఎం ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తులతో పాటు నోట ను ఏర్పాటు చేశారు 2014లో జరిగిన శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో 2018 శాసనసభ 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ దఫ్ఫా ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు ఎవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్ను ఈవీఎంలో పొందుపరిచారు ఆ బటన్ నొక్కితే సదరు ఓటు ఎవరికి పడదు ఓటు హక్కుగా నోటా వినియోగించుకున్నట్లే అవుతుంది. గడిచిన 2014 2018 ఎన్నికల్లో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో నోటాకు వెయ్యికి పైగా ఓట్లు రావడం గమనార్హం
– దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనలతో…
అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటర్కు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవ విభాగాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్న తరుణంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా దేశ అత్యున్నత న్యాయస్థానంకు వివరించింది ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినప్పటికీ పలు సంస్థలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి దీంతో అమల్లోకి తీసుకురావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం 2013 సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించింది